కార్వేటినగరం (తిరుపతి) : కార్వేటినగరం మండలంలో వైసిపి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. మండలంలో 22 పంచాయితీలలో 5 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 17 పంచాయితీలకు మంగళవారం ఎన్నికలను నిర్వహించారు. అమ్మపల్లి పంచాయతీకి ఎం.భారతి (14) ఓట్లు మెజారిటీతో, కేశవ కుప్పంలో కె.జ్యోతి (72), పదిరికుప్పంలో డీ.దొరస్వామి (513), అనూరులో వి.సుందర్ రాజు (152), కేఎం పురం లో కే.సరళ (616), సి.డి కండ్రిగలో ఆకుల మంగమ్మ (82), టి కే యం పేటలో ఏ.గోవిందమ్మ (80), ఎంఎం విలాసంలో సి.పవన్ కుమార్ (475), కొర్లగుంట లో ఎస్.దివ్య (459), కే పి అగ్రహారం లో కే.శేఖర్ రెడ్డి (18), కోటర్వెడులో బి. షీలామని (334), సురేంద్ర నగరంలో వీ.పెరియస్వామి రెడ్డి (120), గాజంకిలో ఏ.అరోహర రెడ్డి (310), ఎర్రమరజు పల్లె లో పి.చిన్నబ్బ రెడ్డి (75), ఆర్ కె వి వి పేట లో ఎస్.దివ్య (177), గోపిశెట్టి పల్లిలో కరుణశ్రీ (58), కార్వేటినగరంలో ధనంజయ వర్మ (2650) మెజారిటీతో గెలుపొందారు. మండలంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ కుమార్ తెలిపారు. మండలంలో 81 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి చిన్నరెడ్డెప్ప పేర్కొన్నారు.










