Aug 23,2020 20:37


ప్రజాశక్తి -  అమరావతి బ్యూరో
చేనేత కార్మికుల దగ్గర నిల్వ ఉన్న ఉత్పత్తులను ఆప్కో ద్వారా ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని టిడిపి నేత నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. గత ఐదు నెలలుగా వస్త్ర రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, 'నేతన్న నేస్తం' పథకం ఎంతమాత్రం నెరవేరలేదని విమర్శించారు. ప్రతి నేత కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని, నిబంధనలు లేకుండా ప్రతి నేత కార్మికునికి 'నేతన్న నేస్తం' కింద రూ.24 వేలు ఇవ్వాలని, సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవాలనుకునే ప్రతి నేతన్నకి రూ.1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని అందించాలని కోరారు.