ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ : గుంటూరు కార్పొరేషన్ లో అకారణంగా పని నుండి తొలగించారనే ఆందోళనతో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన కార్మికురాలు విమలను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ రాజధాని గ్రామమైన ఎర్రబాలెంలో బుధవారం నాడు పని విరామ సమయంలో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి మాట్లాడుతూ... గుంటూరు కార్పొరేషన్ లో పని నుండి తొలగించిన కార్మికురాలు విమలను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికురాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికురాలుకి మెరుగైన వైద్య సేవలు అందించాలి. రాజధాని ఏరియా పారిశుద్ధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎంరవి డిమాండ్ చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని హనుమయ్య నగర్ లో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న విమల అనే కార్మికురాల నీ స్థానిక కార్పొరేటర్,మేయర్ విధుల నుండి అకారణంగా తొలగించడాన్ని రాజధాని ఏరియా పారిశుధ్య కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎం రవి ఖండించారు. విమలను పని నుండి తొలగించినందుకు నిరసనగా రాజధానిలోని ఎర్రబాలెంలో బుధవారం నాడు మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ పనిలో నుండి తొలగించబడిన కార్మికురాలు స్థానిక కార్పొరేటర్, అధికారులు మేయర్ చుట్టూ తిరిగి తనను పనిలో పెట్టుకోమని వేడుకున్న పనిలోకి తీసుకోకపోవడంతో కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియక ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పటల్ పాలైన కార్మికురాలికి న్యాయం చేయాలని రవి కోరారు. కార్మికురాల నీ పని నుండి తొలగించి వేధింపులకు గురి చేసి, ఆత్మహత్య చేసుకునే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు. కార్మికురాలు విమలను వెంటనే పనిలోకి తీసుకొని పని భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాబు, శివకోటి, ఆదిలక్ష్మి రామారావు తదితరులు పాల్గొన్నారు.










