- కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి
ప్రజాశక్తి - వేంపల్లె : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోనే గ్రామ సచివాలయాలు నిర్మించినట్లు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పాములూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ ల భవనాలను కడప ఎంపి అవినాష్ రెడ్డి ప్రారంభించారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను అగ్రామ ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించి అప్పుడప్పుడే అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు అందరికి అందాలనే సంకల్పంతో ప్రతి గ్రామంలో కూడ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయా గ్రామాల్లో ఉన్న ప్రజలు, రైతులు మండల కేంద్రాల్లో ఉన్న కార్యాలయాలు చూట్టూ తిరగకుండా గ్రామ సచివాలయాల్లోనే ప్రభుత్వ సేవలు పొందవచ్చు అన్నారు. రైతులకు కూడ రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులోనే ఉంచినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణా ప్రాంతాల్లోనే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు జగనన్న ప్రభుత్వం విద్య, వైద్యం, విద్యుత్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమమే జగనన్న ధ్యేయం అన్నారు. బడుగు బలహీన వర్గాల పేదలు అందరు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అయా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. కోట్లాది రూపాయలతో గ్రామీణా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టుతున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడ ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి తెలియ జేయాలని సూచించారు. వార్డు వాలింటీర్లు వ్యవస్థను తెచ్చి నవ శకానికి నాంది పలికినట్లు చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పాటు పడుతున్నట్లు చెప్పారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో గ్రామీణ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోని ఆర్థిక పురోగతి సాధించాలని కోరారు. అర్హత ఉండి పథకాలు అందని వారు ఉంటే అలాంటి వారికి కూడ పథకాలు మంజూరు అయ్యే విధంగా వార్డు వాలింటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది పని చేయాలని కోరారు. సిఎం జగనన్న ఇచ్చిన హామీలను 95 శాతం పూర్తిగా అమలు చేయడం జరిగిందని చెప్పారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగనన్నను మరో సారి ఆశ్వీరదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఒఎస్టీ అనిల్ కుమార్ రెడ్డి, జడ్పీటిసి రవికుమార్ రెడ్డి, ఎంపిపి లక్ష్మి గాయత్రీ, ఎపిఐఐసి డైరెక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డి హజ్ హౌస్ డైరెక్టర్ మునిర్, వేంపల్లె సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, అయ్యవారిపల్లి సర్పంచ్ రామగంగిరెడ్డి, పాములూరు సర్పంచ్ మధు ప్రబాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రవిశంకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ డిఇ రవిచంద్రారెడ్డి, ఎంపిడిఓ మల్లికార్జునరెడ్డితో సహ అయా మండల స్థాయి అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.










