Nov 12,2023 15:40

అమ్మప్రేమ - ఉషోదయం
అమ్మ నవ్వు - గిటారు పాటల ఆనందం
అమ్మ మాట - పూబాలల సుగంధం
అమ్మ పాట - కోకిల రాగం తీయదనం
ఆహారానికి ఆక్సిజన్‌ కలిస్తేనే శక్తి
మరో ప్రపంచం చూడాలంటే
అమ్మ బొజ్జలోని ఉమ్మనీరే సృష్టికి ముక్తి
నాటినుండే ప్రారంభమౌతుంది ఆలోచనా శక్తి
అమ్మ కోపం - నీటిబుడగంత సమయం
అమ్మ అనురాగం - సప్తవర్ణాల సమ్మోహనం
అమ్మ ప్రేమ, కోపం - కడలి అలల సంబంధం
సృష్టికి మూలం అమ్మ
భవిష్యత్తు ముందుకు సాగుటకు
కరిగించుకుంటుంది తన జన్మ
కృషికి తగిన వడ్డీ కోరనిది
ఈ మూలపుటమ్మ
ఎన్ని తపస్సులు చేస్తే లభిస్తుంది అమ్మఒడి
ఆ ఒడిలోనే మొదలౌతుంది జీవితపు బడి
అమ్మప్రేమ లభించిన ప్రాణికి హోలీసంబరం
ఆ హాయైన చూపు నోచుకోని మనసుకు మహా సంగ్రామం
మురిపాలు పంచునది మరల మరల దొరకనిది
మరుజన్మకు కోరుకునేది
అవనిపై ప్రతిబింబించిన దైవమే ఈ అమ్మ!

ఎస్‌. దయావతి

నయంపిపియస్‌.

మాచవరంనికందుకూరు (మం)