- నాడు వరాహాల దాడి నేడు వానరాల దాడి.... భయాందోళన గురవుతున్న చిన్నారుల తల్లిదండ్రులు.....
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ క్వార్టర్స్ సమీపంలో నివాసముండే ఉపాధ్యాయుడు రాజు కుమారుడు నాలుగు సంవత్సరాల హితేశ్వర్ పై వానరం దాడి చేసి చేతికి తీవ్రంగా గాయం చేసింది గతంలో కోటవీధిలో నివాసం ఉంటున్న మహమ్మద్ రఫీ కుమారుడు ఇంటి సమీపంలో కాల కృత్యాలు తీర్చుకుంటూ ఉండగా వరాహం (పంది) ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేసి మర్మంగాన్ని కొరకడంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని అనంతపురం ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందించడంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు ఇటీవల కాలంలో మండల కేంద్రమైన నార్పలలో పందులు, కోతులు, కుక్కలు దాడులు అధికమయ్యాయని స్థానిక ప్రజలు చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మండల కేంద్రంలో అధికంగా ఉన్నటువంటి పందులు, కోతులు, కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో కార్యదర్శి పై దాడి జరిగితే మౌనం దాల్చిన స్థానికులు అందుకే నేడు ఈ దుస్థితి నార్పల మేజర్ పంచాయతీ కార్యదర్శిగా గతంలో విధులు నిర్వహించినటువంటి చంద్రశేఖర్ గ్రామంలో పందులు అధికమై వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామానికి దూరంగా పందులను నిర్ణయిత గడువులోపు తరలించాలని లేని పక్షంలో పందులను పట్టించి ఇతర ప్రాంతాలకు తరలిస్తామని పందుల నిర్వాహకులకు తెలిపారు అయినా వారు కార్యదర్శి ఆదేశాలను లెక్క చేయకపోవడంతో పులివెందుల ప్రాంతం నుండి మనుషులను పిలిపించి పందులు పట్టించడానికి ప్రయత్నించగా స్థానిక పందుల పెంపకం దారులు పంచాయితీ కార్యదర్శి చంద్రశేఖర్ పై విచక్షణారహితంగా దాడి చేసి తల పగలగొట్టినప్పటికీ స్థానిక ప్రజలు మౌనం దాల్చారు తమ పిల్లలు తమ ఆరోగ్యం కోసమే అధికారులు కష్టపడి పని చేస్తుంటే అటువంటి వారిపై పందుల పెంపకం దారులు నిర్దాక్షిణ్యంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన తమకేందుకులే అన్న విధంగా స్థానిక ప్రజలు వ్యవహరించడం తోనే నార్పల లో ఈ పరిస్థితి దాపురించిందని ప్రస్తుతం నార్పలలో పందులు, కోతులు, కుక్కలు అధికమైన కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు సైతం వెనకడుగు వేస్తున్నారని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.










