మూడింట రెండొంతుల మందికి మొండిచేయి - పిఎం కిసాన్ నుంచి 8 కోట్ల మంది రైతులు అవుట్
- మూడేళ్లలోనే 67 శాతం మంది తగ్గుదల
- ఏపిలో 27.48 లక్షలు, తెలంగాణాలో 14.78 లక్షల మంది కోత
- కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల వెల్లడి
- మోడీ ప్రభుత్వ తీరు దిగ్భ్రాంతికరం : ఎఐకెఎస్ నాయకులు అశోక్ ధావలే
ప్రజాశక్తిాన్యూఢిల్లీ బ్యూరో : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎంకిసాన్) లబ్ధిదారులైన రైతుల్లో మూడింట రెండొంతుల మందికి మోడీ సర్కారు మొండిచేయి చూపించింది. 2019 ఫిబ్రవరిలో మొదటి విడత నుంచి 2022 మే-జూన్‌లో 11వ విడత వరకు పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 11.84 కోట్ల నుంచి 3.87 కోట్లకు తగ్గింది. 67 శాతం తగ్గుదల నమోదైందని, 7.97 కోట్ల మంది లబ్ధిదారులు పిఎం కిసాన్‌కు దూరం అయ్యారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తునాుయి. హక్కుల కార్యకర్త కన్హయ్యకుమార్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. 11వ విడత నిధులను పొందిన రైతులు సంఖ్య 67 శాతం తగ్గిందని తెలిపింది. 2022 మే-జూన్‌లో 11వ విడత రూ.2,000నికేవలం 3.87 కోట్ల మంది రైతులకే వారి ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 ఫిబ్రవరి 2019లో మొదటి విడతను పొందిన 11.84 కోట్ల మంది రైతులతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గింది. 12వ విడత అక్టోబర్ 2022లో పంపిణీ చేశారు. మొదటి విడతలో 11.84 మంది రైతులుండగా, 9.87 కోట్ల మంది రైతులకుఅందిన ఆరో విడత నుంచి క్రమంగా తగ్గుదల చోటుచేసుకుంది. ఏడో విడతలో 9.30 కోట్లకు, ఎనిమిదో విడత 8.59 కోట్లకు, తొమ్మిదో విడత 7.66 కోట్లకు, పదో విడత 6.43 కోట్లకులబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
- ఏపిలో 27.48 లక్షలు, తెలంగాణాలో 14.78 లక్షల మంది రైతులు తగ్గుదల
ఆంధ్రప్రదేశ్‌లో పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు తగ్గిందని, ఈ మూడేళ్లలో 27.48 లక్షల మంది తగ్గారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో మొదటి విడతలో 39.10 లక్ష మంది రైతులకు పిఎంకిసాన్ అందగా, 11వ విడతకువచ్చే సరికి 24.32 లక్షల మంది రైతులకు తగ్గారు. ఈ మూడేళ్లలో 14.78 లక్షల మంది రైతులు పిఎం కిసాన్ నుంచి తొలగించబడ్డారు. బీహార్‌లో లబ్ధిదారుల సంఖ్య 83 లక్షల నుండి ఏడు లక్షలకుతగ్గగా, ఛత్తీస్‌గఢ్‌లో 37 లక్షల నుంచి రెండు లక్షలకు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎనిుకల నేపథ్యంలో గుజరాత్‌లో 2019లో 63.13 లక్షల మంది రైతులు ఈ మొత్తానిు పొందగా, 2022లో 28.41 లక్షల మంది రైతులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. హర్యానాలో 19.73 లక్షల మంది రైతులు మొదటి విడత లబ్ధి పొందగా, 11 విడత 11.59 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. మహారాష్ట్రలో లబ్ధిదారుల సంఖ్య 2019లో 1.09 కోట్ల మంది రైతుల నుంచి 2022 నాటికి 37.51 లక్షలకు భారీగా తగ్గింది. మధ్యప్రదేశ్‌లో 2019లో 88.63 లక్షల మంది లబ్ధిపొందగా, 2022లో 12,053 మంది రైతులు ఈ మొత్తానిు పొందారు. మేఘాలయలో మొదటి విడతలో 1.95 లక్షల మంది రైతులు పిఎం కిసాన్ పథకం నుంచి లబ్ధి పొందగా, 11వ విడతలో 627 మంది రైతులు లబ్ధి పొందారు. పంజాబ్‌లో మొదటి విడతలో 23.34 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే, 11వ విడతలో 11.31 లక్షల మంది రైతులకుతగ్గిందనిగణాంకాలు స్పష్టం చేస్తునాుయి.
ఉత్తరప్రదేశ్‌లో 2019లో 2.6 కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ సాయం అందగా, 2022లో అది 1.26 కోట్లకు చేరింది. పశ్చిమ బెంగాల్‌లో 2019లో 45.63 లక్షల మంది రైతులకు పిఎం కిసాన్ సాయం అందగా, ఆరో విడత నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకుఅందలేదనిడేటా స్పష్టం చేస్తోంది. అస్సాంలో మొదటి విడతలో 28.79 లక్షల మంది రైతులకుపిఎంకిసాన్ అందగా, 11వ విడతలో 2.54 లక్షల మంది రైతులకే అందింది. చండీగఢ్‌లో 2022 మేాజూన్‌లో కేవలం ముగ్గురికే ఈ మొత్తం అందింది. ఢిల్లీలో ఈ సంఖ్య 16,513 నుంచి 2,065కి తగ్గింది. హిమాచల్‌ప్రదేశ్‌లో 9.86 లక్షల నుంచి 5.43 లక్షలకుతగ్గింది. జమ్ముకాశ్మీర్‌లో లబ్ధిదారులు 12.07 లక్షల నుంచి 5.61 లక్షలకుతగ్గారు. జార్ఖండ్‌లో 11వ విడతలో 4.17 లక్షల మంది రైతులే అందుకునాురు. మొదటి విడతలో 27.07 లక్షల మంది రైతులు అందుకునాురు. కర్ణాటకలో ఈ సంఖ్య 55.61 లక్షల నుంచి 2.58 లక్షలకుతగ్గింది. కేరళలో 36.99 లక్షల మంది నుంచి 24.23 లక్షల మంది రైతులుతగ్గారు. ఒరిస్సాలో 39.20 లక్షల మంది రైతుల నుండి 7.05 లక్షల మందికి తగ్గారు. తమిళనాడులో 46.8 లక్షల లబ్ధిదారుల నుండి 23.04 లక్షల మందికి తగ్గారు. త్రిపురలోనూ సగానికి సగం తగ్గింది. 2019లో లోక్‌సభ ఎనిుకలకు ముందు పిఎంకిసాన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 (మూడు విడతల్లో, విడతకి రూ.2000 చొప్పున) ఇవ్వనునాురు. మొత్తం 12 విడతల్లో రూ.2.16 లక్షల కోట్లు రైతులకు అందజేశామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.
- గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి : అశోక్ ధావలే, ఎఐకెఎస్
ఈ గణాంకాలు చాలా దిగ్భ్రాంతికి గురిచేశాయని ఎఐకెఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే తెలిపారు. ''2022లో ఈ డేటా ప్రకారం మూడొంతుల మంది రైతులకు చెల్లింపులు అందలేదు. లబ్ధిదారుల సంఖ్యలో ఇంత తగ్గుదలకుఎటువంటి కారణం లేదు. ఈ పథకానిు కేంద్రం మెల్లమెల్లగా నీరుగార్చే ప్రయతుం చేస్తోందని స్పష్టం. ఈ పథకం చట్టబద్ధంగా హామీ ఇవ్వబడిన ఎంఎస్‌పికి ప్రత్యామాుయం కాదు. రైతులు ఎదుర్కొంటును అసలైన సమస్యలను అధిగమించేందుకు ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించాలి. ఈ పథకం జుమ్లా'' అని ధావలే స్పష్టం చేశారు.










