Jun 15,2023 16:36

ప్రజాశక్తి-పత్తికొండ : సీఎం సహాయనిది పేదలకు ఒక వరమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. గురువారం పత్తికొండలో ఎమ్మెల్యే స్వగృహంలో పత్తికొండ వెల్దుర్తి, క్రిష్ణగిరి తుగ్గలి, మద్దికేర మండలాల సంబంధించిన సీఎం సహాయనిధి 25లక్షల విలువ గల చెక్కును 17 మంది లబ్ధిదారులకు  కంగాటి శ్రీదేవి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలోనికి రాని రోగాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక రోగాలకు ఆపరేషన్లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. పేదవారి ఆరోగ్యానికి, జీవితాలకు అండగా నిలుస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక బోరాసాన్ని కల్పిస్తున్నాడని తెలిపారు. ఆరోగ్యశ్రీలో 2400కి పైగా రోగాలను చేర్చడం జరిగిందని, అంతేకాకుండా మిగతా రోగాలకు సీఎంఆర్ఎఫ్ నుండి సహాయమందించడం జరుగుతుందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి నాయకులు బనగాన శ్రీనివాసులు చక్రాల్లా సర్పంచి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.