Jul 14,2023 16:33
  • జన్మదిన వేడుకల లో ప్రత్యేక సంచిక ఆవిష్కరణ 

ప్రజాశక్తి - తాళ్లరేవు: పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రజాశక్తి నిజాన్ని నిర్భయంగా వ్రాయడంలో ముందుంటుందని ముమ్మిడివరం  ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ఆయన విడుదల చేసి మాట్లాడారు. పేద ప్రజల సమస్యల పట్ల, నిష్పాక్షికంగా వ్రాస్తూ పత్రికా రంగంలో ప్రజాశక్తి సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. ముమ్మిడివరం అనాతవరం సెంటర్లో గ్రాండ్ పార్క్ కళ్యాణమండపంలో అట్టహాసంగా జరిగిన  ఎమ్మెల్యే పొన్నాడ జన్మదిన వేడుకల్లో ప్రజాశక్తి సంచిక ను ఆయన ప్రత్యేకంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ప్రజాశక్తి బృందం తెచ్చిన కేకును కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. తాళ్లరేవు, కాట్రేనికోన, ఐ. పోలవరం, ముమ్మిడివరం మండలాల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజాశక్తి సమన్వయ కమిటీ కన్వీనర్ పావనమూర్తి, జర్నలిస్టులు జి . మల్లేశ్వర రావు, శ్రీనివాస్, కుమార్, సురేష్, దుర్గ బాబు పలువురు అధికారులు పాల్గొన్నారు.