Feb 13,2023 15:26

చందర్లపాడు : చందర్లపాడు మండలంలోని కోనాయపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం ప్రారంభించారు. అనంతరం ఖాతాదారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ఖాతాదారులకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన సేవలు అందిస్తూ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ పలు బ్రాంచ్ లను ఏర్పాటు చేస్తూ తమ సేవలను విస్తరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఆర్.యం., మేనేజర్, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.