ప్రజాశక్తి-చాపాడు : గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ఎస్ రఘురాంరెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని పెద్ద గురువులు సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకుంటున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలలోనే సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. శ్రీరాముల పేట గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వర్షం నీరు నిలుస్తుందని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. శ్రీరాముల పేట ఎస్సీ కాలనీలో లెవెన్ కె.వి విద్యుత్ లైన్లు గృహలపై వెళుతున్నాయని వాటిని ప్రక్కన ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సంబంధిత అధికారులకు సమస్యలున్న వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఎంపీపీ లక్ష్ముమయ్య, తహసిల్దార్ సుభాని, ఈఓపీఆర్డీ రాధాకృష్ణ వేణి, ఎఓ మ్యాగీ, అంగన్వాడీ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, ఎపిఎం వెంకట రమణ, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, గృహ సారథుల మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వేమారెడ్డి, గ్రామ సర్పంచ్ రాజేష్, వైసీపీ నాయకులు ఓబుళ రెడ్డి, జయ సుబ్బారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రమణయ్య, జయ రామిరెడ్డి, సీవి సుబ్బారెడ్డి, సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.










