ప్రజాశక్తి-కాకినాడ : 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్కేటింగ్ రింగ్ స్టేడియం నిర్మాణపు పనులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి స్టేడియం రింగ్ రోడ్డు నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం నిర్మాణపు పనులను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పరిశీలించి చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై స్వయంగా ఆయనే పర్యవేక్షించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి సర్వంగ సుందరంగా స్టేడియంను తయారు చేయాలని ఆయన తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులు ఫ్రూటీ కుమార్ గోదావరి కళాక్షేత్రం, ముత్తా గోపాలకృష్ణ ప్లై ఓవర్ బ్రిడ్జి, స్కేటింగ్ రింగ్ స్టేడియంలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ నారాయణరావు, జే ఎస్ ఈ ఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, అజ్జూ, రెడ్డి శ్రీను, యినుకొండ పట్టాభిరామయ్య, ఇంజనీరింగ్ అధకారులు ఉన్నారు.










