- మృతుని కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందజేత
ప్రజాశక్తి-తుళ్ళూరు : విధి నిర్వహణలో పాము కాటుకు గురై మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ భౌతిక కాయాన్ని గురువారం గుంటూరు జీజీహెచ్ లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే RK మృతుని కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈనెల 23 వ తేదీ అర్థరాత్రి పాముకాటుకు గురై మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పవన్ కుమార్ విషయమై సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.










