ప్రజాశక్తి-పెదకూరపాడు : పెదకూరపాడులోని మిరప నర్సరీపై గడ్డి మందు ప్రయోగించినట్లు పెదకూరపాడు రైతులు గురువారం తెలిపారు. రైతులందరూ ఒకచోట నేల మీద నర్సరీలు ఏర్పాటు చేసుకున్నారు. గడ్డి మందు ఉపయోగించారని తెలుపుతున్నారు. ఒక ఎకరం 50 సెంట్లు చిన్న, సన్న కారు, కౌలు రైతులందరూ మిరప నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి పిచికారీ చేసినట్లు అనుమానిస్తున్నారు. 15 మంది రైతులు సుమారు పది లక్షల రూపాయలు విలువచేసే విత్తనాలను నాటుకున్నారు. నాటి 15 రోజులు అయింది. పూర్తిస్థాయిలో ఎండ వస్తేనే ఎంత నష్టం అనేది తెలిసే అవకాశం ఉంది.










