Apr 27,2023 16:35

ప్రజాశక్తి-సామర్లకోట : ప్రపంచ కార్మిక దినోత్సవం 137వ మేడే ను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం స్థానిక బేవరేజ్ డిపో హమాలీ సబ్యులకు పిలుపు నిచ్చిన హమాలిస్ యూనియన్ అధ్యక్షులు నాళం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభ్యసమావేసంలో ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పనిని, సెలవులు, కార్మిక హక్కులు సాధించిన రొజు మేడే అని అన్నారు. కార్మికులకు మేడే  అసలైన పండగ రొజు అని అన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ పండుగగా జరుపుకొంటున్న 137వ మేడేను హమాలీ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హమాలిస్ గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ మేడే కరపత్రాలను ఆవిష్కరించి మేడే ప్రాధాన్యత గురించి సబ్యులకు వివరించారు మన నాయకులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. 44 కార్మిక చట్టాలను మార్చి యజమానులకు బానిసలుగా ఉండే 4లేబర్ కోడ్ లను తీసుకొస్తుందిని కార్మికులు తమ సమస్యలపై అడిగే హక్కు లేకుండా, యూనియన్ లు పెట్టుకొనే హక్కు లేని చట్టాలను తీసుకొస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. హమాలీ రెక్కల కష్టంపై వచ్చే ఆదాయం మాత్రం ప్రభుత్వనికి వేల కోట్ల రూపాయలు వెల్లుతున్నా హమాలీలకు పి.ఎఫ్, ఇ. ఎస్. ఐ,సంక్షేమ పథకాలు, సంక్షేమ బోర్డు అమలు చేయడంలో ప్రభుత్వం నిరకుశంగా వ్యవరిస్తుందని ఆయన అన్నారు. కార్మికులంతా ఐక్యతతో ఈ మేడే స్పూర్తితో మన హక్కులు కాపాడు కోవాలని ప్రతీ కార్మికుడు ఇంటిపై కార్మిక జెండా సిఐటియు జెండా ఎగుర వేయాలని హమాలీ సబ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హమాలీ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు, యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.అప్పలరాజు, కోశాధికారి బి.ఆదినారాయణ, పి. సత్తిబాబు, వి.గోవిందు, కె.దుర్గాప్రసాద్, యు.సతీష్,బి.భాస్కర్, ఎ.అర్జున్, బి.వాసు అధిక సంఖ్యలో హమాలీ సభ్యులు పాల్గొన్నారు.