- కోటలో ఘనంగా మేడే ఉత్సవాలు.
- ఆకట్టుకున్న వేషధారణలు
ప్రజాశక్తి-సామర్లకోట : ప్రపంచ కార్మికుల పండుగ మేడే ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీని సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానిక మెహెర్ కాంప్లెక్స్ వద్ద నుండి మఠం సెంటర్, స్టేషన్ సెంటర్, దేవి చౌక్ మీదుగా బళ్ల మార్కెట్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బళ్ల మార్కెట్ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఎన్.సురేష్ మాట్లాడుతూ యజమానులు లాభాలే ద్యేయంగా కార్మికులతో 20 గంటల పాటు పనిచేయుచుకుంటూ కార్మికుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ కనీస వసతులు లేనటువంటి ధర్నాల్లో అనేకమంది సంఘంగా ఏర్పడి 8 గంటల పని దినాల కోసం వేలాదిమంది కార్మికులు ప్రాణాలు అర్పిస్తే 8 గంటల పని దినాలు సాధించుకోవడం జరిగిందని అన్నారు. కానీ నేడు బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంతోమంది ప్రాణాలు అర్పించి సాధించిన 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే చట్టాలను బిజెపి చేస్తుందని అన్నారు. రానున్న రోజులలో కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని దాని కోసం ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మికులకు నష్టం వాటిల్లే చట్టాలను తక్షణం రద్దు చేయాలని లేకుంటే కార్మికులతో మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవ్వాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక పిఠాపురం రోడ్డులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు అలాగే జి.రాగం పేట రోడ్ లోని బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్, అంగనవాడి, బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో బళ్ల మార్కెట్ సెంటర్,మఠం సెంటర్, గాంధీనగర్, సాయి నగర్, వాటర్ ట్యాంక్ రోడ్ ,భాస్కర్ కాలనీ, మెహర్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో పాటు మండల వ్యాప్తంగా అనేక గ్రామాలలో బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరణల కార్యక్రమం నిర్వహించారు. మేడే సందర్భంగా ఏర్పాటుచేసిన భారతమాత, వివేకానంద, చేగువేరా, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీ భాయి, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్,అధిక ధరల భూతం,రాణి రుద్రమదేవి వేషధారణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కరణం ప్రసాదరావు,బేవరేజెస్ హమాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు, హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాళం సత్యనారాయణ , వి.అప్పలరాజు , అంగన్వాడి అర్బన్ అధ్యక్షులు ఎ.అమలావతి, నాయకులు కే.వరలక్ష్మి, బాలం లక్ష్మి, రూరల్ నాయకులు వి.ఎస్తేర్ రాణి, ఎస్ కే. ఫాతిమా, బి.దేవి కుమారి, వరలక్ష్మి, సీఐటీయూ ఉండూరు నాయకురాలు జి.మహాలక్ష్మి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సామర్లకోట నాయకులు కోనా రాంబాబు, మామిడి జగదీష్, మాధవపట్నం నాయకులు కే. లోవబాబు, రమేష్, ఖాజా, కాపవరం నాయకులు రాంబాబు, కనకారావు, దుప్పట్ల సంఘం నాయకులు కరణం శ్రీనివాసరావు, కరణం సత్యనారాయణ, కరణం గోవిందరాజు, రిక్షా సంఘం నాయకులు ముప్పిడి సత్తిబాబు, చెప్పుల నూకరాజు, సీఐటీయూ నాయకులు బాలం సత్తిబాబు, దారభాని కృష్ణ, సింహాచలం, సోషల్ మీడియా కన్వీనర్ బాలం హరిబాబు, ఐటీ వీరబాబు, కరణం రామకృష్ణ, కరణం ఏడుకొండలు, బత్తుల బాలాజీ, కాకర్ల సత్తిబాబు పాల్గొన్నారు.










