May 01,2023 15:12

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్ద దింపే వరకు విశ్రమించరాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశ కార్మికుల పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో సుందర విగ్రహానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పూలమాలవేసి జోహార్లు అర్పించారు. అనంతరం సిఐటి జెండాను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల సిఐటి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు పి నోమేశ్వరి మేడే గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా డి.గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఎనిమిది గంటల పని కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులై సాధించుకున్నదే మేడే అని అన్నారు. మోడీ కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీని గద్దె దింపేవరకు విశ్రమించరాదని అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభతో దేశ పేరు ప్రతిష్టాలను తెచ్చే విధంగా పనిచేస్తున్న క్రీడాకారులు, రెజ్లర్లపై జరుగుతున్న హింసకు నిరసనగా ఢిల్లీలో మహిళా క్రీడాకారులు రోడ్లపైకి వచ్చిన క్రిమినల్ కేసులు పెట్టడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు స్పందించడంతో సుప్రీంకోర్టు మందలించడంతో కేసు పెట్టారని తెలియజేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. మహిళలపై అత్యాచారాలు హింసలు చేసే వారిపై బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారికి రక్షణ ఉంటుందని అన్నారు. మేడే సందర్భంగా కార్మికులు ప్రతిజ్ఞ భూమి ని గద్ద దింపే వరకు నిద్రపోరాదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈ పుల్లారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ అలివేలు ప్రజానాట్యమండి కళాకారులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్మికులు మహిళలు పాల్గొన్నారు.