Jun 01,2023 12:56

ప్రజాశక్తి - తుళ్లూరు : ఢిల్లీలో మహిళ రెజ్లర్లపై జరిగిన దాడులను నిరసిస్తూ గురువారం రాజధాని గ్రామం తుళ్లూరులో సిఐటియు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. గ్రామంలోని లైబ్రరీ సెంటర్లో సిఐటియు జెండా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధాని డివిజన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి ఎం రవి, ఎం భాగ్యరాజు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెజ్జర్లపై అణచివేత వైఖరిని ఎండగడుతూ ప్రసంగించారు. మోడీకి దేశ ప్రజలు గుణపాఠం చెబుతారంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం నాయకులు వి వెంకటేశ్వరరావు, మదర్ థెరీసా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జెట్టి నరేంద్ర, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.