ప్రజాశక్తి-తెనాలి : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీలో జరుగుతున్న వారు చేపట్టిన ఆందోళనకు సంఘీభావంగా పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ కంచే చేను మేసిన చందంగా రెజ్లర్ల అసోసియేషన్ సంఘ అధ్యక్షునిగా ఉన్న బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడటం అమానుషమన్నారు. తక్షణమే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల పై పోలీసుల వేధింపులు మానుకోవాలన్నారు. మహిళ రెజ్లర్ల ఆందోళనకు సిఐటియు అండగా నిలుస్తుందన్నారు. స్థానిక అన్నాబత్తుని పుర వేదిక వద్ద నిర్వహించిన నిరసన లో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె రవికుమార్, ఎం సాంబశివరావు, పి కోటేశ్వరరావు, బి నాగేశ్వరరావు, టి పాములు, నల్లయ్య, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.










