May 27,2023 16:56

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్రంలో దివ్యాoగులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఏపీలో దివ్యాoగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వికలాంగుల హక్కుల పోరాట సమితి చేపట్టిన రాష్ట్ర స్థాయి ధర్నాలో భాగంగా శనివారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాలు ఫలితంగా దివ్యాoగులు పింఛన్ రూ.3వేలకు చేరిందన్నారు. ప్రస్తుత ధరభారాల నేపధ్యంలో పింఛన్ రూ.6వేలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధానమైన 32డిమాండ్స్ పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు షేక్ నబి, నవీన్, ఎమ్మార్పీఎస్ నేతలు, అధిక సంఖ్యలో దివ్యాoగులు పాల్గొన్నారు.