ప్రజాశక్తి-తుగ్గలి(కర్నూల్) : మండల కేంద్రమైన తుగ్గలి చెరువు కట్ట మలుపు దగ్గర స్కూటర్ అదుపుతప్పి మారెళ్ళ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ (45) గురువారము మృతి చెందారు. మారెళ్ళ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ మద్దికేర మండలం పెరివలి గ్రామంలోని వారి బంధువుల ఇంటి నుండి తిరిగి ప్రయాణంలో వస్తుండగా తుగ్గలి చెరువు మలుపు దగ్గర స్కూటర్ అదుపు తప్పి పక్కన కాలవలోకి బోల్తా పడింది. దీంతో మహమ్మద్ రఫీ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తుగ్గలి ఎస్సై మల్లికార్జున హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భార్య ఫీరాభి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు. మృతి చెందిన మహమ్మద్ రఫీకి భార్య తోపాటు ఇద్దరి పిల్లలు ఉన్నారు.










