
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా గురువారం ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు.ఆమె వాంగ్మూలం ఇచ్చేందుకు పార్లమెంట్ లోపలికి వెళ్తున్న సమయంలో మూడు బ్యాగులను కూడా తన వెంట తీసుకెళ్లారు. నగదు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ టిఎంసి ఎంపికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.
హోం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుండి ఎథిక్స్ కమిటీకి వచ్చిన నివేదికలతో పాటు ఇతర పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా మహువాను ప్రశ్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 26న జరిగిన విచారణలో మూడు ప్యానెల్స్ నివేదికలను పంపాల్సిందిగా ప్యానెల్ ఆదేశించింది. ఆమె లాగిన్ ఐపి చిరునామాలు మరియు ఆమె ఉన్న ప్రాంతం ఒకటేనా అని కమిటీ ప్ర శ్నించింది.