- పటవలలో జగనన్నే మా భవిష్యత్తు పాల్గొన్న ఎంపీపీ రాయుడు సునీత
ప్రజాశక్తి - తాళ్లరేవు : పటవలలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి వైకాపా ప్రభుత్వం పట్ల ప్రజలను ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునీత మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలంతా ఆనందంగా ఉన్నారని అన్నారు. మండలంలో ప్రతిచోట జగనన్న పరిపాలన పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొటికలపూడి చంద్రశేఖర్, గ్రామ కమిటీ కన్వీనర్ కాల వెంకటరమణ, పటవల ఉపసర్పంచ్ చక్కపల్లి లక్ష్మణ్, వైకాపా నాయకులు కొప్పిశెట్టి వెంకట్, సిహెచ్సి డైరెక్టర్ లోవలక్ష్మీ, పంచాయతీ వార్డు సభ్యులు, వాలంటీర్లు, గృహసారథులు పాల్గొన్నారు.










