- - వ్యక్తి పై కేసు నమోదు
ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఆదివారం ఎస్ఇబి సిఐ కె.వి స్వామి ఆధ్వర్యంలో ఎస్ ఈ బీ సిబ్బంది జరిపిన దాడుల్లో సారా తయారీకి రహస్యంగా నిలవ ఉంచిన 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఈబీ ఎస్ఐ వై నాగేంద్ర కృష్ణ తెలిపారు. అనంతరం మరలావ గ్రామంలో నిర్వహించిన పరివర్తన కార్యక్రమంలో సారా అనర్థాలపై, సారా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.










