Jun 22,2023 16:08
  • జిల్లా లైన్స్ గవర్నర్ మంగతాయారు

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : లైన్స్ క్లబ్ 316 (బి) జిల్లాలో సామర్లకోట శ్రీ భీమేశ్వర క్లబ్ సేవల్లో మొదటి స్థానంలో నిలిచిందని లయన్స్ జిల్లా గవర్నర్ మాటూరి మంగతాయారు అన్నారు. గురువారం లయన్స్ జిల్లా గవర్నర్ మంగతాయారు అధికార పర్యటనలో భాగంగా సామర్లకోట క్లబ్ కి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక క్లబ్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే జిల్లా క్లబ్ సమాజ సేవ విషయంలో ప్రథమ స్థానంలో పయనిస్తుందన్నారు. జిల్లా క్లబ్ ద్వారా ఎప్పటి వరకు 15 మెగా ఈవెంట్స్ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. కేవలం జిల్లా పరిధిలోని అన్ని క్లబ్బుల్లో ఉన్న సభ్యులందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో క్లబ్బులు ఉండగా లైన్స్ క్లబ్ మాత్రం సమాజ సేవ విషయంలో ఎంతో ముందుందన్నారు. 210 దేశాల్లో 14 లక్షల మంది సభ్యులు కలిగే లైన్స్ క్లబ్ సేవలు అందించడం చిన్న విషయం కాదన్నారు. రానున్న రోజుల్లోనూ జిల్లా క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున జిల్లాలోని క్లబ్బులన్నీ ఇదే ఉత్సాహంతో సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇలా ఉండగా కార్యక్రమంలో సామర్లకోట క్లబ్లో ముగ్గురు కొత్త సభ్యులను చేర్చుకునే కార్యక్రమాన్ని జిల్లా గవర్నర్ మంగతాయారు చేతుల మీదగా చేపట్టారు. అలాగే పేదలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు, వంటి సామాగ్రిని అందించి వారి జీవనోపాధికి తోడ్పాటు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిత్తలూరి వీరాజు (రాజా), శ్రీదేవి దంపతుల వివాహ దినోత్సవ సందర్భంగా గవర్నర్ మంగతాయారు ఆధ్వర్యంలో ఘనంగా వారిని సత్కరించి, కేకు కోయించి, నూతన వస్త్రాలు బహూకరించి వేడుకలు జరిపారు. దీనికి ముందు గవర్నర్ మంగతాయారు స్థానిక భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇంకా ఇటీవల యోగా పోటీల్లో అంతర్ జాతీయ పోటీలకు ఏమికైన యశ్వంత్ కు గవర్నర్ చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సెకండ్ వైస్ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, స్థానిక క్లబ్ అధ్యక్షులు సుధారాణి, కార్యదర్శి సేపేని సురేష్, కోశాధికారి శ్రీనివాస్, లైన్స్ నాయకులు కర్రీ ఆదినారాయణ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, గుండు శంకర్రావు, కొర్లమండ వీరభద్రరావు, ఎం విజయలక్ష్మి, కొర్లమండ శ్రీవాణి, డి రాజు మాస్టర్, క్లబ్ పరిధిలోని అందరు నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.