
ప్రజాశక్తి-మంగళగిరి : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో బుధవారం మంగళగిరి విద్యుత్ ఏ డిఈ ఈ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయలు బారాలు మోపిందని విమర్శించారు. సర్దుబాటు చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు, ఇతర చార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై గతంలో ఎన్నడు లేని విధంగా చార్జీలు పెంచారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణ వలన చార్జీలు పెరిగాయని అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జరిగే ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యుత్ ఏ ఈ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చేంగయ్య్, సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్, పట్టణ నాయకులు కే ఏడుకొండలు, జె శివ భవన్నారాయణ, జే బ్రాహ్మణి, ఎన్ వెంకటేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ నాయకులు నందం బ్రహ్మేశ్వరావు, జే జాన్ బాబు, జి సామ్ రెడ్డి, జే సాంబశివరావు, టి వెంకటయ్య, డి ఈశ్వరరావు, ఏ మరియదాసు, జి జానీ, బి శ్రీనివాసరావు, సిపిఐ ఎంఎల్ నాయకులు కే కోటేశ్వరరావు, ఏ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు