Jul 17,2023 15:26

ప్రజాశక్తి-ఏలేశ్వరం : మొవ్వ బార్ అసోసియేషన్ న్యాయవాది జి శ్రీనివాసరావుపై దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు న్యాయవాదులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టంశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై దాడులు సర్వసాధారణంగా మారయన్నారు. శ్రీనివాసరావుపై దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు రక్షణ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గంగాధర్ రావు, సహాయ కార్యదర్శి రాయ శ్రీనివాసరావు, కల్చరల్ కార్యదర్శి శివకుమార్, సీనియర్ న్యాయవాదులు చెలంకూరి రామకృష్ణ, ఏ కుక్కుటేశ్వరరావు, రాజాల చిట్టిబాబు, ఎం మంజుష, న్యాయవాదులు ఉన్నారు.