ప్రజాశక్తి-ఆదోని రూరల్ : మండలం పరిధిలో పెద్ద హరివనం గ్రామ బస్టాండ్ లో రోడ్డుకు స్పీడ్ బేకర్ వేసి ప్రాణాలను కాపాడాలని కాపాడాలని కెవిపిఎస్ మండల ప్రధాన కార్యదర్శి బి.తిక్కప్ప, డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బస్టాండ్ ఆవరణంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి అనంతరం వారు మాట్లాడుతూ పెద్ద హరివాణం బస్టాండులో రోడ్డుకు స్పీడ్ బ్రేకర్ లేనందువల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని, వాహనాలు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయని కానీ సంబంధిత అధికారులు మాత్రం స్పీడ్ బ్రేకర్ వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని అని తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించే బస్టాండ్ రోడ్డుకు స్పీడ్ బ్రేకర్ వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి రోడ్డు దిగ్బంధం కార్యక్రమం చేస్తామని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు గురు బసవ, లింగప్ప, రఘు, హనుమంతు పాల్గొన్నారు.










