ప్రజాశక్తి-విజయవాడ : మణిపూర్ లో గిరిజన, గిరిజనేతర జాతుల మధ్య మతోన్మాద మారణ హోమానికి తెరదీసిన మనువాద మతోన్మాద బిజెపి అమానుష చర్యలను నిరసిస్తూ విజయవాడ మాచవరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన తెలిపారు. కెవిపిఎస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి నటరాజు అధ్యక్షతన నిరసన సభలో కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సజీవ సాక్షి సమూహం చర్చి పాస్టర్ యారం దానియేలు, క్రిస్టమస్ పండుగ నిర్వాహక కమిటీ అధ్యక్షులు జి వరప్రసాద్ , జమాయత్ మసీద్ పెద్దలు రిజ్వాన్, దళిత అభ్యుదయ సమైక్య పెద్దలు కొసనం కోటేశ్వరరావు, కెవిపియస్ నాయకులు సిహెచ్ శ్రీనివాస్, జి అరుణ, కరి మోజస్ , ఐద్వా నగర నాయకులు జి సునీత, కడియాల ఉషారాణి, అంబడపూడి దేవ కుమారి, వి శ్యామలత, కె పద్మ, కె అనురాధ, జి అమృతరావు తదితర పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టి 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినది. 2024 లో కూడా మత విద్వేషాలు సృష్టించి అధికారంలోకి రావటానికి, మణిపూర్ రాష్ట్రంలో ఎస్టీ జాతుల మధ్య తేడాలు చూపుతూ బీజేపీ మారణహోమం చేస్తుందన్నారు. ఆవులకు ఇచ్చిన ప్రాధాన్యత ఆడవారికి ఇవ్వకుండా వారని అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ వారిపై అత్యాచారాలు చేస్తున్నారు . ముద్దాయిలను కాపాడుతున్నారు. దేశ ప్రధానమంత్రి నోరు మెదపటం లేదన్నారు. దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పెట్రోలు , డిజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపకుండా ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అమ్మివేస్తున్నారు. వీటి నుండి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి అల్లర్లను ప్రోత్సహిస్తుందన్నారు. వీటన్నిటిని అడ్డుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజల ఐక్యంగా మనువాద మతోన్మాద చర్యలను తిప్పుకొట్టాలన్నారు. నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగిందన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో మరియు మణిపూర్ లో ఇంత దుర్మార్గమైన దారుణమైన సంఘటనలు జరుగుతున్న మన రాష్ట్రంలోని అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జగనన్న, చంద్రన్న, పవన్ లు మాట్లాడకపోవడం దుర్మార్గమైన దారుణమైన చర్య అన్నారు. ఇంకనైనా మాట్లాడాలన్నారు. లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ నిరసన లో పాల్గొన్న వారందరికీ కెవిపిఎస్ తరపున ఉద్యమ అభివందనలు తెలియజేశారు.










