- కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రియా మాల్యాద్రి డిమాండ్
ప్రజాశక్తి-నందిగామ : దళితుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో 26 వేల కోట్లు కేటాయించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రియా మాల్యాద్రి డిమాండ్ చేశారు. నందిగామ సుందరయ్య భవన్ లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జనభా ప్రాతిపదికన నిధులు కేటాయించకుండా, 20 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.బడ్జెట్ వివరణ ఉంది తప్ప అంకెలేవన్నారు.దళితులకు కేటాయించాల్సిన సంక్షేమ పధకాలు నవరత్నాల ఖర్చు చూపించటం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సి, ఎస్టి సబ్ ప్లాన్ నిధులు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత వాడలలో మౌళిక సదుపాయాలు,భూమి కొనుగోలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, నిందితులను కాపాడుతూ దళితుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పలు రకాల సమస్యలపై మార్చి 23న విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసనను దళితులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా చేపట్టే జనభా లెక్కలతో పాటు కుల ప్రాతిపదికపై విడిగా జనభా లెక్కలు సేకరించాలన్నారు. పవర్ ఆఫ్ అటార్నరీ చట్టాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ,మోనిటైజేషన్ పైపులైనులు ఆపాలన్నారు. కాంట్రాక్టు,ఆవుట్ సోర్సింగ్ కార్మికులందరిని క్రమబద్ధీకరించాలన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల అమలు కోసం నిర్భంధంగా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్నారు. ఎస్సి,ఎస్టి, ముస్లిం, మైనార్టీల రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ చట్టాన్ని పునరుద్ధరించి రాజ్యాంగ స్ఫూర్తితో అమలు చేయాలని కోరారు. ఉచిత విద్య, ప్రభుత్వ ఆరోగ్య సేవలను విస్తరించి అమలు చేయాలని కోరారు.దళితులు,మహిళలు, మైనార్టీలపై ఉద్దేశ్య పూర్వకంగా జరుగుతున్న దాడులు,హత్యలకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టం రూపొందించాలన్నారు. భూసీలింగ్ చట్టాన్ని తిరిగి పునఃవర్గీకరించి భూమి లేని పేదలందరికి భూ పంపిణీ చేయాలని కోరారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిపార్సులు, అసైన్డ్ చట్టాన్ని,అటవీ హక్కుల చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. ఉపాధి హమీ చట్టాన్ని కేంధ్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్లు కేటాయించాలని, కుటుంబానికి 200 రోజులు, 600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.










