Sep 24,2023 16:16
  •  సిపిఎం సీనియర్ నాయకులు కొరటాల సత్యనారాయణ శత జయంతి వేడుకలు.

ప్రజాశక్తి-సత్తెనపల్లి: చేనేత రంగ సమస్యల పరిష్కారానికై కొరటాల చేసిన కృషిని మరువలేమని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కట్ట శివ దుర్గారావు అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పుతుంబాక భవన్ లో జరిగిన కొరటాల సత్యనారాయణ శతజయంతి వేడుకల లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి సిపిఎం  పట్టణ కార్యదర్శి ధరణికోట విమల అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివ దుర్గారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ విద్యార్థి దశలోనే రాజకీయాలకు ఆకర్షితులై స్వాతంత్ర ఉద్యమంలో  పాల్గొన్నారని అన్నారు. ఆ తర్వాత వామపక్ష రాజకీయాలకు ఆకర్షితులైన కొరటాల సత్యనారాయణ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చేనేత రంగ సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యులుగా, పోలెట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారని అన్నారు. 1962లో వేమూరు నియోజకవర్గం నుండి, 1978  రేపల్లె నియోజకవర్గం నుండి సిపిఎం శాసనసభ్యులు గెలిచిన కొరటాల సత్యనారాయణ తన చివరి ఊపిరి వరకు సిపిఎం నాయకులుగా తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రొంపిచర్ల పురుషోత్తం, అనుముల వీర బ్రహ్మం, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్ ,మామిడి జగన్నాథరావు, పొట్టి సూర్యప్రకాశరావు, షేక్ సిలార్ మసూద్ తదితరులు పాల్గొన్నారు.