Jun 18,2023 16:21

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ గా మండలం లోని వెట్లపాలేం గ్రామానికి చెందిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి  కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికైనారు. ఆదివారం కాకినాడ రాయల్ పార్క్ లో ద్వారంపూడి భాస్కర రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తనను సహాయ కార్యదర్శి గా ఎంపికైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనును భాస్కర రెడ్డి తదితరులు అభినందించారు.