Sep 21,2023 11:01

టొరంటో  :  కెనడాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది సుఖా దుంకెన్‌ హత్యకు గురయ్యాడు. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్‌ జరిపిన దాడిలో సుఖా దుంకెన్‌ మరణించినట్లు ఎన్‌ఐఎ  వర్గాలు తెలిపాయి. పంజాబ్‌కు చెందిన సుఖా దుంకెన్‌ 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడా పారిపోయినట్లు ఆ వర్గాలు  తెలిపాయి. అనంతరం కెనడా కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్‌ అర్షదీప్‌ దల్లా ముఠాలో చేరినట్లు సమాచారం. అతను అర్షదీప్‌ దల్లాకు అత్యంత సన్నిహితుడని,   ఖలిస్తానీ ఉద్యమంలోనూ  సుఖా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.  ఖలిస్తాన్  టైగర్‌ ఫోర్స్‌ అధ్యక్షుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హత్యకు గురయ్యాడు. అతని హత్యలోభారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే.