- పాతబస్తీ బ్యాంక్ నూతన కౌంటర్ ను ప్రారంభించిన చైర్ పర్సన్ మహాలక్ష్మి.
- పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన పాలకమండలి.
- ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం చైర్ పర్సన్ మహాలక్ష్మీ.
ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధానకార్యాలయము నందు బ్యాంకు యొక్క పర్సన్ ఇంచార్జి కమిటీ సమావేశము చైర్ పర్సన్ ఎస్.మహాలక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశము నందు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపైన సమీక్ష చేయుటతో పాటు మరికొన్ని ముఖ్యమైన నిర్ణయములు తీసుకోవడం జరిగిందని చైర్ పర్సన్ మహాలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మహాలక్ష్మి బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి రామాంజనేయులు మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే బ్యాంక్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నందు 7 నూతన శాఖలను ప్రారంభించుటకు తీర్మానించామని. 1) నేరుడు చెర్ల (ప్యాపిలి మండలము), 2) సీతారామాపురం (బేతంచెర్ల మండలము), 3) ఎద్దు పెంట (డోన్ మండలము), 4) యాళ్ళూరు (గోస్పాడు మండలము), 5) మంచాల (మంత్రాలయం మండలము), 6) నందవరం గ్రామం బనగానపల్లె మండలం), 7) కొలిమిగుండ్ల గ్రామం (కొలిమిగుండ్ల మండలం) అలాగే కోడుమూరు పట్టణం నందు శ్రీ నీలకంఠేశ్వర హ్యాండ్ లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ మరియు సీల్ సోసైటీ లిమిటెడ్ (పి.డబ్లు నెం.31) కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా వారికి క్యాష్ క్రెడిట్ క్రింద రూ. 8.20 లక్షలు మంజూరు చేయుటకు తీర్మానించమన్నారు. తద్వారా శ్రీ నీలకంఠేశ్వర హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ మరియు సీల్ సొసైటీ లిమిటెడ్ (పి.డబ్ల్యు నెం.31) కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా చేనేత కార్మికులను ఆర్ధికంగా మరింత ముందుకు తీసుకుపోవడానికి బ్యాంకు చర్యలు సహాయపడతాయన్నారు. బ్యాంకు బ్రాంచీల ద్వారా నేరుగా దీర్ఘకాలిక ఋణాలు పొంది వాయిదా మీరిన అప్పులపై ఇదివరకే అమలు పరచినటువంటి తేది. 30.06.2023 తో ముగిసిన వడ్డీ ఉపశమన పథకమును తిరిగి కొనసాగించుటకు తేది. 01.07.2023 నుండి తేది. 30.09.2023 వరకు అమలు పరచుటకు తీర్మానించడమైనది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పాతబస్తీ బ్యాంకింగ్ శాఖను ఖాతాదారుల సౌకర్యము నిమిత్తము మొదటి అంతస్తు నుండి క్రింది అంతస్తుకు మార్పు చేయడం జరిగిందన్నారు. ఆధునీకరించిన బ్యాంకింగ్ కౌంటరును బ్యాంకు చైర్ పర్సన్ మహాలక్ష్మీ ప్రారంభించారు. బ్యాంకు ఖాతాదారులు ఈ యొక్క మార్పును గమనించగలరని తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు పర్సన్ ఇంచార్జి కమిటీ సభ్యులు గుండం సూర్యప్రకాష్ రెడ్డి , నాసారి వెంకటేశ్వర్లు, కె. వెంకట రమణా రెడ్డి, వెంకటేశ్వరమ్మ, సీమ సుధాకర్ రెడ్డి, మూలింటి రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశములో అజెండా అంశములు మరియు బ్యాంకు అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యకార్యనిర్వహణాధికారి పి.రామాంజనేయులు పాలకవర్గ సమావేశమునకు నివేదించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు త్రినాథ్ రెడ్డి,రాఘవేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.










