May 14,2023 12:56

కళ్ళు .. ఆకలికి ఆనవాళ్ళు
కాళ్లు .. ఆరాటానికి నకళ్ళు
గుండెపొరల్లో ఏదో కుంభవృష్టి
వాన లోపలో బయటో
దేహం మాత్రం వణికిపోతూనే ఉంది!
పరుగు ఒంటిరిగానే మొదలయింది
మధ్యలో ఏవో పాదాలు కలిశాయి
పెనవేసుకున్న అనుభూతుల్ని వదల్లేక
తనువో క్షణం సుడిగుండమయింది!
ఇప్పుడు నేను..
కదిలే నదిలా
నదిలో నావలా
తీరాన్ని వెతుకుతూ తిరుగుతూనే ఉన్నాను! డా. జడా సుబ్బారావు
8919459045