Jun 11,2023 16:32
  • వేసవి ఉషూ  శిక్షణ ముగింపు  జిల్లా  ఉషూ సంఘం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ 

ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఉషూ క్రీడా శిక్షణ శిబిరం ఆదివారం ఉదయం ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఉషూ సంఘం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని  మాట్లాడరూ  చిన్నారులు 40 రోజులపాటు ఉషూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం చాలా సంతోషిదాయకం అన్నారు. మార్షల్ ఆర్ట్స్ వలన సాహసం, ఉత్సహం, ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ,చదువుతోపాటు ప్రాథమిక దశ నుండే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోటం రక్షణకు ఉపయోగపడుతుంది అన్నారు. ఈ  రోజుల్లో ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన క్రీడల్లో సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఇంతటితో ఆపకుండా రోజు సాధన చేయాలని అన్నారు.అనంతరం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులకు బ్యాగులు ఫల హరమ్ అందించారు. అనంతరం సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. జిల్లా ఉషూ సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరంలో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారని, పలు రకాల ఉషూ విన్యాసాలు చేశారని, ఉషూ మాస్టర్స్ సుధాకర్, అముతేశ్వర్,  శ్రీనివాసులు, చిరంజీవిలు, క్రాంతి కుమార్ పాల్గొన్నారు.