ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణను నియమించారు. కన్నా లక్ష్మినారాయణను ఇన్చార్జిగా నియమిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీచేశారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు కన్నా లక్ష్మీనారాయణను ఇన్చార్జిగా నియమించారు. కన్నాతో కలిసి పనిచేయాలని ఆశావహులకు సూచించారు. కన్నా లక్ష్మినారాయణను ఇన్చార్జిగా నియమించన నేపథ్యంలో టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఇన్చార్జి లేకపోవటంతో టికెట్ ఆశిస్తున్న వారు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కన్నాను ఇన్చార్జిగా ప్రకటించిన నేపథ్యంలో సత్తెనపల్లి సీటు ఆశిస్తున్న వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.










