కావాల్సిన పదార్థాలు:
బచ్చలి కూర- రెండు కట్టలు, కంద- పావు కేజీ, చింతపండు- తగినంత, ఉప్పు- సరిపడా, ఆవాలు- నాలుగు టీస్పూన్లు, నూనె-నాలుగు టీస్పూన్లు, పచ్చిమిర్చి-నాలుగు, ఎండుమిర్చి-నాలుగు, శనగపప్పు- టీస్పూను, మినప్పప్పు- టీస్పూను, కరివేపాకు-రెండు రెబ్బలు.
తయారుచేసే విధానం :
- కంద చెక్కు తీసి, చిన్నముక్కలుగా కోసుకోవాలి. బచ్చలికూరని సన్నగా తరగాలి. రెండింటినీ శుభ్రంగా కడిగి, పసుపు వేసి కుక్కర్‌లో ఉడికించాలి. తర్వాత చిల్లుల గిన్నెలో వేసి, నీరు వడగట్టాలి.
- చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరి, పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కలు వేయాలి.
- అవి ఎర్రగా వేగిన తర్వాత అందులోనే అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఆపై ఉడికించిన కూరను అందులో వేసి, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి.
- ఐదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి, బాగా కలపాలి.