
ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని గంగంపాలెం గ్రామంలో గోకవరం మండల టిడిపి ప్రధాన కార్యదర్శి సాలాపు నలమహారాజు ఆధ్వర్యంలో బుధవారం సుమారు 25 మంది గిరిజన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా పాల్గొని 25 మంది గిరిజన యువకులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టులు, నిర్బంధనలు చూసి పార్టీ కోసం మేము కష్టపడి పని చేస్తామంటూ వైఎస్ఆర్సిపిని వీడి టిడిపిలోకి చేరిన గిరిజన యువకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానాని, వీరి ప్రధాన సమస్య ఈ ప్రభుత్వంలో ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఈ సమస్య వల్ల గిరిజన యువకులు ఉద్యోగాలు కానీ ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు కావడం లేదని తెలిపారు. ఈ సమస్యను రాబోయే టిడిపి ప్రభుత్వంలో ఎస్టీ సర్టిఫికెట్లు గజిటెడ్ నోటిఫికేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, మంగ రౌతు రామకృష్ణ, జీన్ మణిబాబు రేఖ బుల్లి రాజు, దాసరి సీతారామయ్య,కుంచె రామకృష్ణ, సుంకపల్లి వీర వెంకట సత్యనారాయణ, కురువేళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.