కానుగ చెట్టు చలువంటా
అటు ఇటు నాటితే మేలంటా
నీడను మనకు ఇచ్చునంటా
చల్లని గాలి వీచేనంటా
వేప వేప చేదంటా
ఆరోగ్యానికి మేలంటా
రోజూ కొంచెం తినాలంటా
కడుపులో పురుగు చచ్చునంటా
పెద్ద మర్రి చెట్టంటా
గుబురుగా పాకీ పోవునంటా
ఊడలు బాగా దిగునంటా
ఊయలూగుదాం రారంటా
చిగురు చింత చెట్టంటా
చిట్టి చిట్టి ఆకులంటా
పుల్లని రుచికి పేరంటా
చిక్కగా కొమ్మల మానంటా
జాలి లేని జాలి చెట్టంటా
దాని ఒంటి నిండా ముళ్ళంటా
ముట్టుకుంటే కుట్టునంటా
మొత్తం నలుపుగ వుండునంటా
చెట్టు చెట్టు రాగిచెట్టంటా
విశాల కొమ్మల చెట్టంటా
గాలికి ఎంచక్కా కదులునంటా
ఆకులు రెపరెపలాడునంటా
చెట్టు మేలు గొప్పదంటా
ఆక్సిజన్ మనకు ఇచ్చునంటా
వానలు బాగా కురిసేనంటా
చెట్టు లేని లోటు ప్రమాదమంటా ...
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636