
వేకువ జామున నిద్ర లేస్తాం
పాఠాలన్నీ చదివేస్తాం
ముద్దుగా స్నానం చేసేస్తాం
ఉతికిన బట్టలు ధరిస్తాం
అమ్మ చెప్పింది వినేస్తాం
చకచక బడికి వెళ్లొస్తాం
గురువులు చెప్పింది పాటిస్తాం
మధ్యాహ్న భోజనం తినేస్తాం
ఆటలు ఎన్నో ఆడేస్తాం
పాటలు ఎన్నో పాడేస్తాం
బడిలో చెట్లను నాటేస్తాం
హాయిగా ఇంటికి పోయొస్తాం
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.