Jul 28,2023 14:48

ప్రజాశక్తి-పలాస : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద ఎపి జీడి రైతు సంఘం ఆధ్వర్యంలో జీడి మద్దతు ధరపై శుక్రవారం 24 గంటల పాటు సత్యాగ్రహం దీక్షను మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ప్రారంభించారు. ముందుగా ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు జీడి పండు జెండాను రట్టి కృష్ట, మట్ట ఖగేష్ ఆవిష్కరించారు. జీడిరైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల. అజయ్ కుమార్ అధ్యక్షతన శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ.. జీడికి 16 వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఆర్.బి.కె.ల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. జీడి పిక్కలు ధర పాతాలంకు పోతుంటే జీడిపప్పు ధర ఆకాశాన్ని తాకుతున్నదని దీనికి ప్రభుత్వం కారణం కాదా అని ఆయన అన్నారు. 2019లో 80 కేజీలు జీడి పిక్కల బస్తా 14000 ఉంటే నేడు 7000 రూపాయలకు పడిపోయింది. దీంతో రైతాంగం తీవ్రంగా దోపిడీ గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి, మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ సమస్య ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం జీడిపిక్కలు ఎందుకు కొనడం లేదని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం గడపగడపకు వెళ్లి చెప్తున్నారు మంచిదే... మరి జీడిపిక్కలు ధర పడిపోతే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్థానిక మంత్రి అప్పలరాజు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కోసం ఎందుకు చర్చించడం లేదు. చర్చించవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు .గిట్టుబాటు ధర పైన, ఆర్బికే ల ద్వారా కొనుగోలు పైన ప్రతిపక్ష టీడీపీ కూడా తన వైకరిని స్పష్టం చేయాలని ఆయన అన్నారు. జీడి రైతుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలియజేయాలని కోరారు. గత 125 రోజులుగా జీడి రైతులు గిట్టుబాటు ధర కావాలని ఆందోళన చేస్తుంటే ఈ జిల్లాలో ఉండే మంత్రులు గాని స్పీకరుకి గాని పట్టదా అని ప్రశ్నించారు. 80 కేజీల జీడిపిక్కలు బస్తాకు 16 వేల రూపాయలు చెల్లించి ఆర్బికేల  ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు .కేరళ తరహాలో జీడి బోర్డు గాని, లేదా కార్పొరేషన్ గాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక జీడి పిక్కలు కొనుగోలు చేసిన తర్వాతనే విదేశీ జీడిపిక్కల దిగుమతికి అనుమతించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని జీడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.మోహన్ రావు మాట్లాడుతూ జీడి రైతులు ఒంటరిగా లేరని పోరాటానికి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ ,కార్మిక ,కర్షక సంఘాలు మద్దతుగా ఉన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్పు ట్రస్టు అధ్యక్షులు మట్ట ఖగేశ్వరరావు మాట్లాడుతూ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయన అన్నారు. దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, కళాకారులు కె. హేమ సూధన రావు, కె. బాలాజీ రావు ఆటపాటతో పలువురిని కట్టుకున్నారు. పలువురు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోనారి మోహనరావు, కొర్ల. హీమారావు చౌదరి,పోతనపల్లి  కుసుమ, కొర్ణాన బాలాజిరావు, కర్రి సింహాచలం, అంబటి రామకృష్ణ, కీలు తవితయ్య,  సాతుపల్లి,ఈశ్వరరావు,సవర కుమార్,జోగి గవరయ్య, కోనేరు గురయ్య,లు దీక్షల్లో కూర్చున్నారు.ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి, గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆనంతరం ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం జండాను మార్పు ట్రస్టు అధ్యక్ష్యులు మట్ట ఖగేశ్వరరావు, సీనియర్ రైతు ఉద్యమ నాయకులు కంసు కృష్ణారావు లు ఆవిష్కరించారు. ఈ దీక్షలకు క్యాష్యూ లేబర్ యూనియన్ అధ్యక్షుడు, కార్యదర్శి కోనేరు భీమారావు,బొమ్మాళి తాతయ్య, క్యాష్యూ లేబర్ అసోయేషన్ కార్యదర్శి అంబటి ఆనందరావు, ఎస్ యఫ్ ఐ నాయకులు హరీష్,చందు,వంకులూరు యం పి టి సి కొండప్ప సురేఖ, శాతుపల్లి కాంతారావు,,దాసరి శ్రీరాములు,వంకల మాధవరావు,తామడ త్రిలోచన, కె హైమావతి, జె భాగ్యలక్ష్మి, యన్ డిల్లేస్వరి,మద్దిలి రామారావు, తమ్మినాన భాస్కరరావు,బాగాధి, వాసు,ఆర్ దిలీప్ కుమార్, మట్ట ధర్మారావు, సంగారు లక్ష్మీనారాయణ, అండమాన్ ప్రజా పోరాట నాయకులు దుమ్ము లక్ష్మణరావు, కర్రి పాపారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి,తదితరులు పాల్గొన్నారు. 

jeedi-farmers-protest-in-srikakulam

 

jeedi-farmers-protest-in-srikakulam

 

 jeedi-farmers-protest-in-srikakulam-women