May 06,2023 14:33

ప్రజాశక్తి-కోడుమూరు : కోడుమూరు పట్టణంలో కోడుమూరు ఎం ఎల్ ఎ డాక్టర్ జరదొడ్డి సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం కోడుమూరు ఎంఎల్ఎ డాక్టర్ సుధాకర్ కార్యాలయంలో వైస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం  కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ యాదవ్, జిల్లా వ్వక్ఫ్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ షాకీర్, వైస్సార్సీపీ నాయకులు లాయర్ ప్రభాకర్, బలరాం, కౌలుట్ల, గోవర్ధన్,గోవింద్, వెంకటేశ్వర్లు, మిన్నల్ల,  మిలిటరీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.