Jul 14,2023 15:41

ప్రజాశక్తి - కిర్లంపూడి , జగ్గంపేట రూరల్ : కిర్లంపూడి లో వైసిపి కార్యకర్తలు, వాలంటీర్లు కలిసి పవన్ దిష్టి బొమ్మ ను దగ్ధం చేసిన విషయం విదితమే. ఈ సంఘటనను కిర్లంపూడి మండల జనసేన నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ నీ ఎక్కడైతే దగ్ధం చేశారో అదే స్థలములో పసుపు నీటితో శుద్ధి చేసి పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు మాట్లాడుతూ పవన్ ఏమన్నారో పూర్తిగా చూడాలని అసలు వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలను డేటా వల్ల జరుగుతున్న ప్రమాదాలను మాత్రమే పవన్ ప్రశ్నించరన్నారు. అందులో కొంత మంది వాలంటీర్లు చేస్తున్న తప్పుల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపరాన్నరు.  రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా పవన్ కళ్యాణ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ వాలంటీర్లు బలి పశువులుగా, ఒక బానిసలా వాడుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, డేగల విజయ్, మండల ఉపాధ్యక్షులు సత్యంశెట్టి వీర గణేష్, ఎంపిటిసి గోకెడ రాజ, ఎలుబండి శివ, పాలిశెట్టి సతీష్, తదితరులు ఉన్నారు.