ప్రజాశక్తి - కిర్లంపూడి, జగ్గంపేట రూరల్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంపై వైసీపీ నాయకులు, వైసిపి సోషల్ మీడియా ఇంచార్జ్ వర్రా రవీంద్ర రెడ్డి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కిర్లంపూడి జనసేన నాయకులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఉలిసి ఐరాజు మాట్లాడుతూ వ్యక్తి గతంగా విమర్చించలంటే మీ కుటుంబంలో కూడా స్త్రీలు ఉన్నారు కానీ అది తమకు విజ్ఞత కాదు అన్నారు. తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విలువలతో కూడా రాజకీయాలు చేయమని నేర్పరాన్నరు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పలేని వారే ఇలా చేస్తారని సాటి మహిళలుపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే మహిళ కమిషన్ వాసిరెడ్డి పద్మ ఏమి చేస్తున్నారని ఐరాజ్ ప్రశ్నించారు. అనంతరం వైసిపి నాయకులపై కిర్లంపూడి ఎస్ఐ రఘునాథరావుకి ఎఫ్ ఐ ఆర్ కేసు నమోదు చేయాలని పిర్యాదు చేయడంతో ఎస్ఐ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీ.ప్రభాకర్, డెగల విజయ్, పిడుగు జయబాబు, ఎద్దు అర్జున్, కునపరెడ్డి నాని, తదితరులు ఉన్నారు.










