ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు, ప్రమాదబీమా చేయించేందుకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ కోశాధికారి ఎవి రత్నంకు రూ.కోటి చెక్కును పవన్ కల్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.