Jun 12,2023 15:24
  • కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జరదొడ్డి సుధాకర్ 

ప్రజాశక్తి-కోడుమూరు : భవిష్యత్తు తరాలకు నాంది మన జగనన్ననే అంటూ కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జగదొడ్డి సుధాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాడు నేడుతో రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అన్నారు. ఇంతకుముందు పాఠశాలలు ప్రారంభమైన పది రోజుల తర్వాత బుక్స్ బ్యాగు డ్రెస్సు షూస్ కొనేవాళ్లు ఇప్పుడు ప్రారంభమైన మొదటి రోజే అందుకుంటున్నారంటే అది జగనన్న పిల్లల మీద చూపెట్టే చెరువు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ విజయకుమార్ యాదవ్ నాగేంద్రబాబు మాదన రంగస్వామి గిరి శ్రీనివాస్ యాదవ్ సులేమాన్ మిన్నెలా అరుణ్ కుమార్ నాగార్జున రవి రమేష్ గౌరీ మండల విద్యార్థి శాఖ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.