Jul 14,2023 15:08

ప్రజాశక్తి - చాపాడు : జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు లబ్ధి చేకురుతుందని ఎంపీపీ టి లక్షుమయ్య సూచించారు. మండల పరిధిలోని ఎన్ ఓబాయపల్లెలో శుక్రవారం జగనన్న సురక్ష గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభలో 274 మంది లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా అందజేశామని ఎంపీపీ తెలిపారు. ప్రజలకు అవసరమైన 11రకాల దృవీకరణ పత్రాలను సిబ్బంది గుర్తించి ఉచితంగా అందజేస్తున్నరని తెలిపారు. సాధారణంగా కుల, ఆదాయ, కుటుంబ, రేషన్ కార్డు విభజన వంటి దృవీకరణ పత్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధా కృష్ణ వేణి, డిటి భవానీ, ఎఓ మ్యాగీ, వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, సర్పంచ్ అంజనమ్మ, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, మాజీ జడ్పీటీసీ గంగులయ్య, రవి,  పంచాయతీ కార్యదర్శి శ్రీనువాసుల రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.