Oct 04,2023 13:14

ప్రజాశక్తి - చాపాడు : ప్రజలందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎల్ఏ ఎస్ రఘురామిరెడ్డి సూచించారు.బుధవారం మండల పరిధిలోని చియ్యపాడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే  హాజరై వైధ్యసేవల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు ద్వారా కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఐసిడిఎస్ వారు ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్ ను తిలకించారు. గర్భవతులు, బాలింతలు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి లక్ష్ముమయ్య, మండల ప్రత్యేక అధికారి సురేష్ రెడ్డి, ఎంపిడిఓ శ్రీధర్ నాయుడు, తహసిల్దార్ యామిని, మండల వైద్యాధికారులు శ్రీవాణి, ఓబులేసు, ఎంఎస్ తేజ, సర్పంచ్ ప్రసాద్, వైసీపీ మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, వైసిపి నాయకులు పివి రమణారెడ్డి, రాజంద్రనాధరెడ్డి, వేమారెడ్డి, జయ సుబ్బారెడ్డి, అబ్బిరెడ్డి,  రామాంజనేయుల రెడ్డి, నిరంజన్ రెడ్డి, నరసింహారెడ్డి, పుల్లయ్య, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.