Oct 13,2023 15:40
  • వైసీపీ సీనియర్ నాయకులు నార్పల  సత్యనారాయణ రెడ్డి

ప్రజాశక్తి-నార్పల : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, ఇంటి వద్దకే వైద్యాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సీనియర్ నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని 1 మరియు 4 గ్రామ సచివాలయల పరిధిలో బుధవారం స్థానిక  ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన "జగనన్న ఆరోగ్య సురక్ష" మెగా వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు.. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శనను తిలకించి పౌష్టికాహారాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు రుచి చూశారు అనంతరం . వైద్యం కోసం వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు అందజేయాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు వరం లాంటిది అన్నారు. కార్పొరేటు వైద్యానికి దీటుగా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దివాకర్ తాసిల్దార్ హరికుమార్ సర్పంచు సుప్రియ ఉపసర్పంచ్ శ్రీరాములు మేజర్ పంచాయతీ కార్యదర్శి అస్వత నాయుడు కార్యదర్శిలు పరశురాముడు చరణ్ వైద్యులు ప్రవీణ్ కుమార్ రవిశంకర్ సిహెచ్ఓ బాలాజీ సూపర్వైజర్ల అకులప్ప వైసీపీ నాయకులు మన్నిల శివయ్య భాస్కర్ నాయుడు భాస్కర్ రెడ్డి చికెన్ గోపాల్ రమేష్ మల్లికార్జున మోహన్ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.